ఆలమూరులో వైసీపీ ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన

ఆలమూరులో గురువారం వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో 'వెన్నుపోటుకు రెండేళ్లు' కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తూ, మేనిఫెస్టోను దహనం చేశారు. పెరుగుతున్న ధరలు, రైతులు, నిరుద్యోగుల సమస్యలపై వైసీపీ నిరంతరం పోరాడుతుందని జగ్గిరెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గ పరిశీలకులు పాటి శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్