అరాచాలకు నిలయంగా అనపర్తి : జక్కంపూడి

అనపర్తి నియోజకవర్గంలో అరాచకాలకు నిలయంగా మారిందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. శనివారం అనపర్తిలో మీడియాతో మాట్లాడారు. రెచ్చిపోతు రౌడీయిజం చేస్తున్న ప్రతి కూటమి గుండాకి రేపు తప్పక బాధపడే రోజు వస్తుందని అన్నారు. దుప్పలపూడి గ్రామంలో ఎస్సీ సోదరులపై దాడి చేయడం పిరికిపంద చర్య అని రాజా అన్నారు. భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరించారు

సంబంధిత పోస్ట్