బొమ్మూరు: తేజస్విని మృతి తీరని లోటు ఎమ్మెల్యే గోరంట్ల

సీనియర్ జర్నలిస్ట్, ఏపీ యుయుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండేలా శ్రీరామ్ మూర్తి కుమార్తె తేజస్విని (29) అకాల మరణం పట్ల మంగళవారం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె పార్థివదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. తేజస్వినిని కోల్పోవడం తీరని లోటని పేర్కొంటూ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

సంబంధిత పోస్ట్