కొవ్వూరులో గుర్తుతెలియని వాహనం ఢీ: ఎద్దుకి తీవ్ర గాయాలు

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో మెరకవీది ఆంజనేయ విగ్రహం వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఒక ఎద్దుకి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం జరిగిన ఈ ఘటనలో ఎద్దు లేవలేని స్థితికి చేరుకుంది. ప్రధాన రహదారుల్లో మూగజీవులు విచ్చలవిడిగా తిరుగుతుండటంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. మూగజీవులను మున్సిపల్ అధికారులు నియంత్రించాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్