రాజమండ్రిలో స్కూటీని ఢీకొన్న బస్సు: వ్యక్తికి తీవ్ర గాయాలు

రాజమండ్రి సిటీలోని కోటిపల్లి బస్టాండ్ ఫైర్ స్టేషన్ ఎదురుగా సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోటిపల్లి బస్టాండ్ సెంటర్ నుంచి రైల్వే స్టేషన్ వైపు వెళ్తున్న స్కూటీని, బొబ్బర్లంక-రావులపాలెం వెళ్తున్న పల్లె వెలుగు బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న వ్యక్తి తీవ్ర గాయాలపాలై కోమాలోకి వెళ్ళిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి 108కు సమాచారం అందించారు.

సంబంధిత పోస్ట్