చాగల్లు మండలం బ్రాహ్మణగూడెం గ్రామ దేవత శ్రీ నాగారమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాలకు పలు గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.