కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వర రావు మంగళవారం కొవ్వూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టూరిజం డిపార్ట్మెంట్ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. రానున్న 2027 గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం కాటేజీలు, పార్కులు, రూములు, రెస్టారెంట్లు నిర్మించడానికి టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా అభివృద్ధి పనులు, వాటి మంజూరు కోసం ప్రతిపాదనలు అందించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మద్దిపట్ల శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.