దేవరపల్లి మండలంలో మానవతా సంస్థ ద్వారా పేదలకు అనేక రకాల సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే, సంస్థ వద్ద శాంతి రథం లేకపోవడంతో మరణించిన వారిని అంత్యక్రియలకు తీసుకెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో దుద్దుకూరు మాజీ సర్పంచ్ కరుటూరి సూర్యారావు జ్ఞాపకార్థం శాంతి రథాన్ని గ్రామ టీడీపీ సీనియర్ నాయకులు ధనుంజయ గురువారం సంస్థకి బహుకరించారు. దీంతో టీడీపీ నాయకులను సంస్థ యాజమాన్యం అభినందించారు. ఈ కార్యక్రమంలో దేవరపల్లి మండల టీడీపీ అధ్యక్షులు బల్ల సూర్య చక్రం, తదితరులు పాల్గొన్నారు.