విద్యార్థులకు ఉచిత కంటి అద్దాలు పంపిణీ

రాజమహేంద్రవరం, జాతీయ అందత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో చాగల్లు మండలం చాగల్లు గ్రామంలోని హై స్కూల్ విద్యార్థులకు ఉచిత కంటి అద్దాలను బుధవారం పంపిణీ చేశారు. కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షులు ఆళ్ల హరిబాబు, AMC చైర్మన్ నాదెళ్ల శ్రీరామ్, మండల టీడీపీ అధ్యక్షులు చిటికిన చిన పెంటారావు, గ్రామ టీడీపీ అధ్యక్షులు దొంగ రామకృష్ణ, బొల్లిన నాగేంద్ర, అబ్బురి సీతారామాంజనేయులు, బొడ్డు కేశవ్ వంటి NDA కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్