దుద్దుకూరు: మాజీ సర్పంచ్ కన్నుమూత

దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామ మాజీ సర్పంచ్ కరుటూరి సూర్యారావు సోమవారం కన్నుమూశారు. దుద్దుకూరు గ్రామ టీడీపీ సీనియర్ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త కరుటూరి ధనుంజయుడు తండ్రి కరుటూరి సూర్యారావు. ఈయన గ్రామ సర్పంచ్ గా గ్రామ అభివృద్ధికి విశేష సేవలందించారు. సూర్యారావు మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మంచి నాయకుడిని కోల్పోయామని గ్రామనాయకులు, పెద్దలు, గ్రామస్తులు బాధను వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్