కొవ్వూరులో ఘనంగా హోలీ సంబరాలు

కొవ్వూరులోని ఇందిరమ్మ కాలనీలో మంగళవారం హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. యువతీ, యువకులు, చిన్నారులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. చిన్నారులు నృత్యాలతో సంబురాల్లో పాల్గొన్నారు. పట్టణంలోని పలు ప్రాంతాలలో కూడా హోలీ వేడుకలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్