ఆపద సమయంలో పేద ప్రజలకు సీఎం సహాయనిధి అండగా ఉంటుందని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం కొవ్వూరు మండలం పసివేదల గ్రామంలో ఉప్పులూరి వీర వెంకట సత్యనారాయణకు రూ. 1,53,646, వేములపల్లి వెంకటేశ్వరరావుకు రూ. 41,792 సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.