కొవ్వూరు: సాగునీరు లేక ఎండిపోతున్న పంటలు: ఉప సర్పంచ్

త్యాజంపూడి గ్రామంలో సుమారు 400 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆవచెరువు సరైన వర్షాలు లేక ఎండిపోయే స్థితికి చేరుకుంది. 800 ఎకరాల పైచిలుకు వ్యవసాయానికి ఈ ఆవచెరవే రైతులకు దిక్కు. తాడిపూడి ఎత్తిపోతల పథకం నుండి నీటిని విడుదల చేయాలని అధికారులను ఉప సర్పంచ్ కుసులూరు వెంకట సతీష్, పల్లి వెంకటరత్నారెడ్డి కలిసి మాట్లాడారు. తూరలు రైతులు ఏర్పాటు చేసుకోవాలి అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు చొరవ తీసుకుని గ్రామ రైతుల సమస్యను తీర్చాలని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్