కొవ్వూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ టి. వి రామారావును ఇటీవల పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన వ్యవహారం పై పార్టీ అధిష్టానానికి సమగ్ర నివేదిక ఇచ్చేందుకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, AP MSME DC చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ సోమవారం కొవ్వూరు విచ్చేశారు. టి. వి రామారావు, పార్టీ నాయకులతో ముఖాముఖి నిర్వహించి వివరాలు సేకరించారు.