కొవ్వూరు: హెల్త్ పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కొవ్వూరు మండలం ఆరికిరేవుల గ్రామంలో హెల్త్ పెన్షన్ ను ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు శుక్రవారం పంపిణీ చేశారు. లబ్దిదారుడు మారిశెట్టి వెంకన్నకి నూతనంగా మంజూరైన హెల్త్ పెన్షన్ రూ. 15, 000/- ను వారి స్వగృహంలో స్వయంగా అందజేశారు. బాధితులకు అండగా ఉండే సంక్షేమ ప్రభుత్వంగా ప్రతి అర్హుడికీ గౌరవంగా ఆర్థిక భరోసా అందించాలనే దిశగా ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు.

సంబంధిత పోస్ట్