కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు బుధవారం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 10.30 గంటలకు చాగల్లులోని గవర్నమెంట్ హై స్కూల్‌లో నిర్వహించే ఐ క్యాంప్‌ను సందర్శిస్తారు. అనంతరం, ఉదయం 11.30 గంటలకు చాగల్లు గ్రామంలో స్వచ్ఛ రథాన్ని ప్రారంభిస్తారు. చాగల్లు మండలంలోని ఊనగట్ల, నెలటూరు, మల్లవరం, కలవలపల్లి, చంద్రవరం, చాగల్లు, బ్రాహ్మణగూడెం, దారవరం గ్రామాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేస్తారు. ఈ కార్యక్రమాలకు NDA కూటమి నాయకులు, కార్యకర్తలు తప్పక హాజరుకావాలని కోరారు.