కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం కొవ్వూరు మండలం మద్దూరులంక గ్రామంలో నిర్వహించిన 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేర్చుతుందన్నారు.