కొవ్వూరు: చోరీ కేసును ఛేదించిన పోలీసులు

గత ఏడాది సెప్టెంబర్ 9న కొవ్వూరులోని కూల్‌డ్రింక్స్ దుకాణంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. విచారణలో భాగంగా రాజమండ్రికి చెందిన గుడ్ల సతీశ్, తమ్మిరెడ్డి సాయి, బండపల్లి అమృత్ అనే ముగ్గురిని ఆదివారం అరెస్ట్ చేసినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి చోరీ చేసిన వస్తువులతో పాటు ఐదు మోటార్‌సైకిళ్లు, వెండి పట్టీలు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్