కొవ్వూరు పట్టణానికి చెందిన ఏపీ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె. ఎస్ జవహర్ విజయవాడలోని ఆయన కార్యాలయం వద్ద పలు సమస్యలతో విచ్చేసిన ప్రజల నుంచి గురువారం అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన సమస్యలపై ఆరా తీశారు. అనంతరం సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.