కొవ్వూరు మండలం ధర్మవరం గ్రామంలో MGNREGS పథకం కింద రూ. 2 లక్షలతో నిర్మించిన గోకులం షెడ్‌ను కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వ్యవసాయాన్ని బలోపేతం చేయడానికి, గ్రామీణ ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.