కొవ్వూరు మండలం కుమారదేవం గండి పోచమ్మ ఆలయం వద్ద ఆదివారం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రాగోలపల్లికి చెందిన నీరుకొండ రవి, దివిలికి చెందిన వల్లభశెట్టి వెంకటేశ్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.