కొవ్వూరు పట్టణంలోని విజయవిహార్ సెంటర్ సమీపంలో ముడు డాబాలవీధిలో గల నారాయణ స్కూల్ నందు బుధవారం వన మహోత్సవ కార్యక్రమాన్ని పాఠశాల ప్రిన్సిపల్ ఎం రాంబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కొవ్వూరు మున్సిపల్ కౌన్సిలర్ , జిల్లా బీజెపి ఉపాధ్యకులు పిల్లలమర్రి మురళీకృష్ణ హాజరై విద్యార్థులను ఉద్దేశించి మానవ జీవితంలో మొక్కల యొక్క ఆవశ్యకత పిల్లలకు తెలియజేశారు.