ఎలైట్ పాఠశాలలో మెగా తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం గురువారం ఘనంగా నిర్వహించారని ప్రిన్సిపాల్ కలగర శ్రీలక్ష్మి తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న తహసీల్దార్ ఎస్.వి. నాయుడు, పిల్లల భవిష్యత్తులో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. ఎంఈఓ భగవతి దేవి, స్పెషల్ ఆఫీసర్ నిర్మల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తల్లిదండ్రులను అభినందించారు.