విలేజ్ హెల్త్ క్లినిక్స్ భవనాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామంలో ఆయుష్మాన్ భారత్ పథకం కింద రూ. 42 లక్షల వ్యయంతో నిర్మించనున్న హెల్త్ క్లినిక్ భవనానికి కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం తాళ్లపూడిలో 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా రూ. 36 లక్షలతో మంజూరైన మరో విలేజ్ హెల్త్ క్లినిక్‌కు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్