కొవ్వూరులోని గవర్నమెంట్ గర్ల్స్ హాస్టల్, సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో చదివి పదో తరగతి పరీక్షల్లో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులను కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు గురువారం అభినందించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సన్మానించి నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆయన సూచించారు.