ఎన్టీఆర్ తెలుగు ప్రజల గౌరవాన్ని చాటిచెప్పిన మహానేత

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కొవ్వూరు బస్ స్టాండ్ సెంటర్‌లోని ఎన్టీఆర్ విగ్రహానికి కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తెలుగు ప్రజల గౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహానేత అని, ఆయన ఆశయ సాధనకు టీడీపీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్