రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు అందజేత

తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామంలో శుక్రవారం నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, RDO రాణి సుస్మిత రైతులకు పాస్ పుస్తకాలు అందజేశారు. గత వైసీపీ ప్రభుత్వం జగన్ ఫోటోతో పాస్ పుస్తకాలు ముద్రించిందని, ఇది ప్రజల ఆస్తిని వ్యక్తిగత ఆస్తిగా భావించడమేనని ఎమ్మెల్యే విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చాక రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు అందిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చామని తెలిపారు.

సంబంధిత పోస్ట్