ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు

కొవ్వూరు గామన్ బ్రిడ్జిపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న వాదలకుంటకు చెందిన వినపల్లి నవీన్‌ను పట్టణ పోలీసులు రక్షించారు. 112 ద్వారా సమాచారం అందుకున్న కానిస్టేబుల్ సూరిబాబు సకాలంలో చేరుకుని యువకుడు నదిలో దూకకుండా అడ్డుకున్నారు. కుటుంబ సమస్యలే దీనికి కారణమని పోలీసులు తెలిపారు. సకాలంలో స్పందించి ప్రాణం కాపాడిన పోలీసుల తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత పోస్ట్