లంక ప్రాంతాల పర్యాటక అభివృద్ధికి రూ.35.50 కోట్ల ప్రతిపాదనలు

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు గోదావరి లంక ప్రాంతాలను ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, ఆర్డీవో సుస్మిత గురువారం పరిశీలించారు. లంక భూముల్లో పర్యాటక అభివృద్ధికి పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) మోడ్‌లో, టూరిజం శాఖ ద్వారా తాత్కాలిక, శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. వంతెన సమీపంలో ఐకాన్ టూరిజం పార్క్ అభివృద్ధి చేయాలని, పుష్కరాలకు వచ్చే భక్తులు, పర్యాటకుల కోసం ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఈ మేరకు రూ.35.50 కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

సంబంధిత పోస్ట్