నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో బూత్ లెవెల్ అధికారులకు శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పి. ప్రశాంతి పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియలో బీఎల్ఓల పాత్ర కీలకమని, శిక్షణ ద్వారా వారి పనితీరులో మెరుగుదల సాధ్యమవుతుందని వివరించారు. ఫారం-6, 6A, 7, 8 ల వినియోగం, ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, మరణించిన మరియు వలస వెళ్లిన వారి వివరాల పరిశీలన, తుది సమాచారం స్పష్టమైన మార్గదర్శకాలు అందించాలని అన్నారు. బిఎల్ఓ పత్రికను ప్రతి బిఎల్వో తప్పకుండా చదవాలని సూచించారు.