రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి రైల్వే బోర్డ్ ఛైర్మన్ సతీష్ కుమార్ ని ఢిల్లీ రైల్ భవన్‌లో గురువారం కలిశారు. ఈ సందర్బంగా బోర్డు చైర్మన్ తో ఎంపీ సమావేశమై గోదావరి పుష్కరాల దృష్ట్యా రాజమండ్రి, గోదావరి, కొవ్వూరు మరియు నిడదవోలు రైల్వేస్టేషన్ల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరారు. అనంతరం కొవ్వూరు, అనపర్తి రైల్వేస్టేషన్లలో రైళ్ల నిలుపుదలను పునరుద్ధరించాలని కోరారు.