రాజమహేంద్రవరం సాయి హాస్పిటల్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఎస్ఐ మంత్ర సర్జికల్ రోబోటిక్ సిస్టమ్ ని మంత్రి కoదుల దుర్గేష్ సోమవారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ఈ విధంగా ఆధునిక వైద్య సాంకేతికతను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ఎంతో కీలకమైన ముందడుగు అని అన్నారు. ఈ రోబోటిక్ సిస్టమ్ ద్వారా అత్యాధునిక శస్త్రచికిత్స సేవలు, నాణ్యమైన మెరుగైన వైద్య సేవలు ప్రజలకు మరింత సులభంగా అందించవచ్చని అన్నారు.