రాజానగరం మండలం పుణ్యక్షేత్రం గ్రామంలో బత్తుల వెంకటలక్ష్మి ఆదివారం పర్యటించారు. పుణ్యక్షేత్రo గ్రామం 3వ వార్డు మెంబర్ పేపకాయల సూరిబాబు అనారోగ్య కారణంగా వైద్యం పొందుతున్నారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నా సేన కోసం- నా వంతు కో-ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి సూరిబాబు నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ధైర్యం చెప్పి పార్టీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.