కొవ్వూరు గామన్ బ్రిడ్జి పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

కొవ్వూరు పరిధిలోని గామన్ బ్రిడ్జిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దుద్దుకూరు గ్రామానికి చెందిన కోటి (36) మరియు తాతిపూడి చిన్న సుబ్బారావు (40) అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. బ్రిడ్జిపై మోటార్ సైకిల్‌ను లారీ ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొవ్వూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్