తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామంలో శనివారం నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వేంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కబడ్డీ, వాలీబాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో జరిగిన ఈ వేడుకలు సంస్కృతి, సంప్రదాయాలతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టూ మెన్ కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి తదితరులు పాల్గొన్నారు.