కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, ఏపీ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్. జవహర్ శనివారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ సభ్యుడు శ్రీపతి బాబు కూడా పాల్గొన్నారు.