కొవ్వూరు నియోజవర్గం, తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. దీంతో డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో నేరుగా మమేకమవుతూ గ్రామంలో పర్యటించారు. ప్రజల అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం గత ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి పథకాలు, విజయాలను ప్రజలకు వివరించారు.