తాళ్ళపూడి మండలం గజ్జరం గ్రామానికి చెందిన పెంటా మాధురికి నూతనంగా మంజూరైన హెల్త్ పెన్షన్ రూ. 15,000 ను కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు శుక్రవారం అందజేశారు. అనంతరం గ్రామంలో నూతనంగా మంజూరైన స్పౌస్ పెన్షన్లు రూ. 4000 చొప్పున లబ్దిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు.