తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో "సుపరిపాలనలో తొలిడుగు" కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. గ్రామంలో డోర్ టు డోర్ తిరిగి ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలు విని వారు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.