తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర బుధవారం మాట్లాడుతూ, కొవ్వూరు రైల్వే స్టేషన్లో రెండు రైళ్లకు హాల్టులు మంజూరు అయ్యాయని తెలిపారు. తిరుమల ఎక్స్ ప్రెస్, విశాఖపట్నం-మచిలీపట్నం మధ్య నడిచే రైళ్లకు ఈ హాల్టులు లభించాయని ఆయన పేర్కొన్నారు. రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు పురందేశ్వరి, రైల్వే జీఎం శ్రీ వాత్సవ, కేంద్ర మంత్రి దృష్టికి పలుమార్లు ఈ సమస్యను తీసుకెళ్లగా, అధికారులు స్పందించి ఈ హాల్టులు మంజూరు చేశారని నాగేంద్ర తెలిపారు.