చాగల్లులో వైసీపీ ఆధ్వర్యంలో 'కూటమి ప్రభుత్వం వెన్నుపోటుకి రెండేళ్ళు' కార్యక్రమం జరిగింది. కొవ్వూరు వైసీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మాట్లాడుతూ, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎన్డీఏ కూటమి అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తోందని ఆయన మండిపడ్డారు.