కొవ్వూరులో పెట్రోల్, డీజిల్ కొరతపై వైసీపీ నిరసన

రబీ కోతల సమయంలో యంత్రాలకు డీజిల్ అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మాజీ ఎమ్మెల్యే, కొవ్వూరు వైసీపీ ఇంచార్జ్ తలారి వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం కొవ్వూరులో పెట్రోల్, డీజిల్ కొరతపై నిరసన కార్యక్రమం చేపట్టారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్