పల్లపులంక, అద్దంకివారిలంకలో మంచు దుప్పటి

కపిలేశ్వరపురం మండలంలోని పల్లపులంక, అద్దంకివారిలంక గ్రామాల్లో మంగళవారం ఉదయం దట్టమైన పొగమంచు పంట పొలాలను కమ్మేసింది. తెల్లని మంచు తెరలతో పచ్చని పొలాలు సరికొత్త అందాన్ని సంతరించుకున్నాయి. అయితే, రహదారులపై కంటిచూపు ఆనని పరిస్థితి నెలకొనడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రకృతి ప్రేమికులను మాత్రం పొలాల్లోని మంచు బిందువులు ఆకట్టుకున్నాయి.

సంబంధిత పోస్ట్