మండపేట వేంకటేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా లక్ష పుష్పార్చన

మండపేట శ్రీనీళా సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో మూడవ రోజు వేడుకల్లో భాగంగా శనివారం తులసి, మల్లెపూలతో లక్ష పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీనటరాజ కూచిపూడి నాట్య అకాడమీ శిష్యబృందం ప్రదర్శించిన నాట్యప్రదర్శన భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీనివాసరావు, చైర్మన్ వాకచర్ల వీరవెంకట సత్యనారాయణ గుప్తా, కమిటీ సభ్యులు, మహిళా సేవకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్