మండపేటలో మహిళలకు ‘శక్తి’ యాప్‌పై అవగాహన

మండపేట వీరభద్రపురంలో గురువారం మహిళల రక్షణ కోసం రూపొందించిన ‘శక్తి’ యాప్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. టౌన్ సీఐ దారం సురేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలకు యాప్ వినియోగం, సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. ఆపద సమయంలో యాప్ ద్వారా పోలీసుల సహాయం ఎలా పొందాలో సిబ్బంది డెమో ద్వారా వివరించారు. మహిళల భద్రతకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని, ప్రతి మహిళా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సీఐ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సుమారు 60 మంది మహిళలు, ఎస్సై రాము మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్