మండపేటలో వైభవంగా బసవేశ్వరస్వామి ఆలయ పునఃప్రతిష్ఠ ఉత్సవాలు

మండపేట పట్టణం 12వ వార్డు సూర్యారావుపేటలో శ్రీ బసవేశ్వరస్వామి వారి నూతన దేవాలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం మంగళవారం రెండవ రోజు వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. పండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ వేడుకలో స్థానిక నేతలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్