గురువారం రాయవరం గ్రామంలోని పంట కాలువలో, స్థానిక దుర్గమ్మ ఆలయం వద్ద సుమారు 50-60 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మృతురాలు నారింజ రంగు జాకెట్, చింతపిక్క రంగు లంగా ధరించి ఉందని ఎస్సై డి. సురేష్ బాబు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మండపేట సీహెచ్‌సీకి తరలించారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు పోలీసులను సంప్రదించాలని కోరారు.