మారేడుబాకలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ

మండపేట మండలం మారేడుబాక గ్రామంలో ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఉపాధి హామీ కూలీలకు జనసేన నాయకుడు సోడసాని మురళి ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది కార్మికులకు చల్లని పానీయాలను అందజేశారు. వేసవి ఎండల్లో పనిచేస్తున్న కూలీల ఇబ్బందులను గుర్తించి ఈ సేవా కార్యక్రమం చేపట్టడం పట్ల హర్షం వ్యక్తమైంది. ఈ కార్యక్రమంలో పంచాయతీ అభివృద్ధి అధికారి శ్రీనివాస్, కూటమి నాయకులు రాయుడు గంగరాజు, పసలపూడి శ్రీనివాస్, వాసంశెట్టి శ్రీనివాస్, పినపోతుల శ్రీను, వల్లు పాండురంగ, ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మి దుర్గ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్