జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా మండపేటలో ధర్నా

చిత్తూరు జిల్లా వి. కోటలో జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యను నిరసిస్తూ, మండపేటలో ఏపీయూడబ్ల్యూజే (APUWJ) ఆధ్వర్యంలో గురువారం భారీ ధర్నా నిర్వహించారు. టపా రామకృష్ణ, సయ్యద్ హుస్సేన్, కోసూరి అప్పారావు నేతృత్వంలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపి, తహసీల్దార్ తేజేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని, హత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని, జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని, జర్నలిస్టులపై పెరుగుతున్న దాడులను అరికట్టాలని వారు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్