ఏడిదలో విద్యార్థులకు ఉచిత విద్యా కానుక కిట్ల పంపిణీ!

మండపేట నియోజకవర్గం ఏడిద గ్రామంలోని జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత యూనిఫారాలు, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో తెదేపా అధ్యక్షుడు పర్వతిన వీర్రాజు, సొసైటీ చైర్మన్ గొడవర్తి సత్యనారాయణ, జనసేన అధ్యక్షుడు రామిశెట్టి రాజా, మేకా జేజిబాబు ముఖ్య అతిథులుగా హాజరై కిట్లను అందజేశారు. విద్యార్థులు ప్రభుత్వ వసతులను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్